హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: బద్వేల్ రూరల్ ఎఎస్ఐ నరసింహారావుకు డీఎస్పీ క్యాష్ రివార్డు
బద్వేల్ రూరల్,ఆగస్టు 28 ప్రజావాణి కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును అత్యంత చాకచక్యంగా,శరవేగంగా ఛేదించిన బద్వేల్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఎఎస్ఐ నరసింహారావు ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రత్యేకంగా అభినందించి,నగదు పురస్కారాన్ని (క్యాష్ రివార్డు) అందజేశారు. దర్యాప్తును నడిపించిన ఎఎస్ఐ ఎకరా 30 సెంట్ల భూవివాదం నేపథ్యంలో రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ క్లిష్టమైన హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో ఎస్ఐ నరసింహారావు కీలక పాత్ర పోషించారు. తన దర్యాప్తు...