prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 9:07 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

 హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: పోరుమామిళ్ల సర్కిల్ ఆఫీస్ రవికి డీఎస్పీ క్యాష్ రివార్డు

పోరుమామిళ్ల, ఆగస్టు28 ప్రజావాణి:కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును ఛేదించడంలో మరియు నిందితులను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోరుమామిళ్ల సర్కిల్ ఆఫీస్‌కు చెందిన రవి,ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి,క్యాష్ రివార్డు (నగదు పురస్కారం) అందజేశారు.
కేసు దర్యాప్తులో సాంకేతిక సహకారం
ఎకరా 30 సెంట్ల భూవివాదం కారణంగా,రూ.6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ హత్య కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.ఈ క్రమంలో పోరుమామిళ్ల సర్కిల్ ఆఫీస్ నుండి రవి గారు కేసు దర్యాప్తుకు అత్యంత కీలకమైన సమాచారాన్ని,సాంకేతిక సహకారాన్ని అందించారు. నిందితుల కదలికలను కనిపెట్టడంలోనూ,దర్యాప్తు బృందాన్ని సరైన దిశలో నడిపించడంలోనూ ఆయన ఎంతో శ్రద్ధతో, కష్టపడి పనిచేశారు.
డీఎస్పీ ప్రశంసలు
రవిచూపిన అంకితభావం,వృత్తి నైపుణ్యాన్ని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కొనియాడారు.ఈ సందర్భంగా రవి కి డీఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డు మరియు అభినందన పత్రాన్ని అందజేశారు.క్లిష్టమైన కేసులను వేగంగా కొలిక్కి తీసుకురావడంలో సర్కిల్ ఆఫీస్ సిబ్బంది అందించే ఇలాంటి సహకారం ఎంతో అభినందనీయమని డీఎస్పీ పేర్కొన్నారు.