హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: మైదుకూరు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ రాంభూపాల్ రెడ్డికి డీఎస్పీ క్యాష్ రివార్డు
మైదుకూరు,ఆగస్టు 28 ప్రజావాణి:కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును అత్యంత వేగంగా,చాకచక్యంగా ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన మైదుకూరు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ సిబ్బంది రాంభూపాల్ రెడ్డి, ని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి,క్యాష్ రివార్డు (నగదు పురస్కారం) అందజేశారు. నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో కీలక పాత్ర ఎకరా 30 సెంట్ల భూవివాదం కారణంగా,రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ క్లిష్టమైన హత్య కేసును ఛేదించడంలో క్రైమ్ పార్టీ తరఫున రాంభూపాల్ రెడ్డి,కీలక...