prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 9:21 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: మైదుకూరు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ రాంభూపాల్ రెడ్డికి డీఎస్పీ క్యాష్ రివార్డు

మైదుకూరు,ఆగస్టు 28 ప్రజావాణి:కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును అత్యంత వేగంగా,చాకచక్యంగా ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన మైదుకూరు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ సిబ్బంది రాంభూపాల్ రెడ్డి, ని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి,క్యాష్ రివార్డు (నగదు పురస్కారం) అందజేశారు.
నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో కీలక పాత్ర
ఎకరా 30 సెంట్ల భూవివాదం కారణంగా,రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ క్లిష్టమైన హత్య కేసును ఛేదించడంలో క్రైమ్ పార్టీ తరఫున రాంభూపాల్ రెడ్డి,కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో నిందితుల కదలికలపై రహస్య నిఘా ఉంచి,వారిని చాకచక్యంగా బంధించడంలో దర్యాప్తు బృందానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించారు. ఆయన ఎంతో శ్రద్ధతో, కష్టపడి పనిచేసి కేసును శరవేగంగా కొలిక్కి తీసుకురావడానికి తోడ్పడ్డారు.
డీఎస్పీ చేతుల మీదుగా పురస్కారం
రాంభూపాల్ రెడ్డి చూపిన అంకితభావం,వృత్తి నైపుణ్యాన్ని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కొనియాడారు.ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి కి డీఎస్పీ  చేతుల మీదుగా క్యాష్ రివార్డు మరియు అభినందన పత్రాన్ని అందజేశారు.నేరాల అదుపులో మరియు నిందితులను పట్టుకోవడంలో సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ సిబ్బంది అందించే ఇలాంటి చొరవ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతుందని డీఎస్పీ పేర్కొన్నారు.