prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 6:03 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

హంగర్గ వీర జవానుకు గ్రామస్థుల ఘన స్వాగతం.

హంగర్గ వీర జవానుకు గ్రామస్థుల ఘన స్వాగతం.

దేశ సేవ ముగించి స్వగ్రామానికి చేరిన గొడుగు గంగాధర్.

పదవి విరమణ సైనికుడికి పోతంగల్ నుండి హంగర్గ వరకు అభినందన ర్యాలీ.

సొంత పాఠశాలలోనే సన్మానం.95 మంది విద్యార్థులకు దుస్తుల పంపిణీ.

కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామ పాఠశాలలో చదువుకొని దేశ సైనికుడిగా 15 సం.ల సుదీర్ఘ కాలం భారత మాత సేవ చేసి పదవీ విరమణ పొంది న గొడుగు గంగాధర్ కు గ్రామస్థులు శనివారం ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోతంగల్ మండల కేంద్రం నుండి హంగర్గ గ్రామం వరకు ఆయనకు అభినందన ర్యాలీ నిర్వహించారు.అనంతరం హంగర్గ ప్రాథమికోన్నత పాఠశాలలో పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ సభలో గొడుగు గంగాధర్ తాను చదువుకున్న పాఠశాలలో చదువుతున్న 95 మంది విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.రానున్న రోజులలో పాఠశాల అభివృద్ధికి తన వంతుగా తోచిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తులు గొడుగు గంగాధర్ దంపతులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.15 సంవత్సరాల సుదీర్ఘ కాలం భారత మాత సేవ చేసి పదవీ విరమణ పొందడం గర్వకారణమని కొనియాడారు.సొంత గ్రామ పాఠశాలలో చదువుకొని దేశ సరిహద్దుల్లో సేవ చేసి తిరిగి అదే పాఠశాలలో విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.గొడుగు గంగాధర్ లాంటి వీర జవాన్లు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, యువత దేశ సేవ వైపు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల ఏఏంసీ మాజీ చైర్మెన్ నీరడి గంగాధర్,సర్పంచ్ నీరడి ఉదయ్ భాస్కర్, ఉప సర్పంచ్ దుర్కి గోపి,పోతంగల్ మండల ఎంఈఓ సాయిలు,హంగర్గ ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి,గ్రామ పెద్దలు,రిటైర్డ్ ఆర్మీ జవాన్లు,ఉపాధ్యా యులు,విద్యార్థులు,గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.