స్వామీజీ పేరుతో అక్రమ వసూళ్లు….భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఆలయ ఈవో భాగ్యలక్ష్మి
ఘట్‌కేసర్, ఆగస్టు 8 (ప్రజా వాణి): మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ యంనంపేటలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో శ్రీ శివ నాగేంద్ర సరస్వతీ మహాస్వామీజీ పేరుతో కొందరు వ్యక్తులు భక్తుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆలయ ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి నగదు ఇచ్చి భక్తులు మోసపోవద్దని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో కాశీ పీఠం పీఠాధిపతి శ్రీ శివ నాగేంద్ర సరస్వతీ మహాస్వామీజీ చాతుర్మాస్య...