స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మరువలేనివి…. ఘట్‌కేసర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘట్‌కేసర్, ఆగస్టు 15: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘట్‌కేసర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగాల భూపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాగించిన పోరాటాలు, చేసిన త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాల కారణంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ...