స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలే మన స్వేచ్ఛకు పునాది…. ఘట్‌కేసర్ ఆర్‌జీకే కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఘట్‌కేసర్, ఆగస్టు 15: ఘట్‌కేసర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని పోచారం ఆర్‌జీకే కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సీనియర్ నాయకులు కల్లూరు జయచంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరు జయచంద్ర మాట్లాడుతూ.. మన జాతీయ జెండా వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని, వారి పోరాటమే మన స్వేచ్ఛకు పునాది అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు....