స్తంభంపల్లి ZPHS పాఠశాలలో ఘనంగా ఇండియన్ ఆర్మీ సైనికుడికి సన్మానం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశేష సేవలందిస్తున్న గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ సైనికుడు చింతల వెంకటేష్ ను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపల్లి రాజయ్య, ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, వార్డు సభ్యులు పాదం అంజలి-దుబ్బ స్వామి, గణేష్, కమలాకర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బండ్ర మౌనిక, హరి ప్రశాంత్, కాశ సురేందర్, వుంజలి పవన్, పాఠశాల...