సోదర భావానికి ప్రతీకగా రక్షాబంధన్* -కత్తుల రాంరెడ్డి, తపస్ మండల అధ్యక్షుడు *నంగునూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తపస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు*
నంగునూరు, ఆగస్టు 28: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను భావితరాలకు అందించడంతో పాటు విద్యార్థుల్లో పరస్పర ప్రేమ, ఆప్యాయత, సోదర భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నంగునూరు మండల అధ్యక్షుడు కత్తుల రాంరెడ్డి అన్నారు. రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నంగునూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తపస్ మండల శాఖ ఆధ్వర్యంలో రక్షా బంధన్ వేడుకలను ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కార్యక్రమాల్లో...