సొంత ఖర్చులతో బోనాల ఏర్పాట్లు.. సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సేవాభావం
ఘట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): బోనాల పండుగ సందర్భంగా అన్నోజిగూడ ఆర్‌జీకే కాలనీలో భక్తుల సౌకర్యార్థం సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వచ్చే ఆదివారం కాలనీలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు కాలనీలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తన సొంత నిధులను వెచ్చిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఆదివారం...