prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 5:55 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

సుద్దులం తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.

సుద్దులం తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.

ప్రజావాణిలో సర్పంచ్ మౌనిక విజయ్ వినతి.

రోడ్డు మరమ్మతులు పూర్తి చేశాం.బస్సు నడపాలని విజ్ఞప్తి.

రవాణా లేక విద్యార్థుల చదువులకు ఇబ్బందులు.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సుద్దులం తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మూడ్ మౌనిక విజయ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.సుద్దులం తండా గ్రామం నుండి ప్రతిరోజూ అనేకమంది విద్యార్థులు కోటగిరి లోని ఉన్నత పాఠశాల,జూనియర్ కళాశాలలకు అలాగే బోధన్ పట్టణంలోని జూనియర్,డిగ్రీ కళాశాలలకు వెళ్తుంటారని తెలిపారు.ప్రస్తుతం గ్రామానికి ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు,గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా రవాణా సౌకర్యం లేక కొందరు విద్యార్థు లు చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.గతంలో బోధన్ డిపో మేనేజర్‌ను కలవగా, గ్రామానికి వచ్చే రహదారిని బాగు చేయాలని సూచించారని గుర్తుచేశారు.ఆ సూచన మేరకు గ్రామ ప్రజల సహకారంతో రహదారి మరమ్మతులు పూర్తి చేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు,పొదలను తొలగించి బస్సు రాక పోకలకు అనుకూలంగా సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రహదారి పూర్తిగా అందుబాటులోకి వచ్చినందున,విద్యార్థు ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బోధన్ డిపో నుండి సుద్దులం తండాకు వెంటనే రోజువారీ ఆర్టీసీ బస్సు సర్వీసు ను ప్రారంభించాలని సర్పంచ్ అధికారులను కోరారు.