సింగరేణి ఎస్టీపీపీ జీఎం నరసింహారావు ఘన సన్మానం

జైపూర్ ,ఆగస్టు 31, ప్రజావాణి: సింగరేణి సంస్థలో 39 ఏళ్లపాటు వివిధ హోదాల్లో అంకితభావంతో సేవలు అందించిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) జనరల్ మేనేజర్ ఎం.నరసింహారావు సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్టీపీపీ ఈడీ సిహెచ్.చిరంజీవి మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధిలో నరసింహారావు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా...