జీవితంలో మనం అనేక బంధాలను, అనుబంధాలను చూస్తాం కానీ ఆ బంధాల విలువ వాటి అవసరం ఉన్నప్పుడు ఆదుకోవడంలోనే ఉంటుంది.
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) శ్రీకాంత్:-
*1. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం వ్యర్థమే:*
మనిషికి ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెడితే దానికి విలువ. ఆకలి తీరాక, లేదా మనిషి లేనప్పుడు పెట్టే విందు వల్ల ప్రయోజనం లేదు.
*2. అలసిపోయినప్పుడు దొరకని నీడ వ్యర్థమే:*
ఎండలో నడిచి అలసిపోయిన వాడికి అప్పుడే నీడ దొరకాలి. గమ్యం చేరాక దొరికే నీడతో ఉపయోగం లేదు.
*3. దుఃఖంలో రాని బంధువులు వ్యర్థమే:*
సంతోషంలో అందరూ వస్తారు సార్. కానీ దుఃఖంలో, కన్నీళ్లలో తోడుగా నిలబడేవాడే నిజమైన బంధువు.
*4. కష్టంలో రాని స్నేహితులు వ్యర్థమే:*
స్నేహం అంటే పార్టీలు, ఫోటోలు కాదు కష్టంలో భుజం తట్టి ” నేనున్నా ” అని చెప్పేవాడే నిజమైన స్నేహితుడు.
*5. చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థమే:*
ఇదే అతి ముఖ్యమైన పాయింట్ సార్. మనిషి బతికి ఉండగా ప్రేమించాలి, గౌరవించాలి. చనిపోయాక దండలు వేసి, శాలువాలు కప్పి, గొప్పగా పొగిడితే ఆ మనిషికి తెలుస్తుందా!
కాబట్టి ఉన్నప్పుడే ప్రేమిద్దాం, ఉన్నప్పుడే సహాయం చేద్దాం.