సబ్సిడీపై పెసర విత్తనాలు లభ్యం
చెన్నారావుపేట ఆగస్టు 20 ప్రజావాణి
జాతీయ ఆహార భద్రత పథకం కింద రైతులకు సబ్సిడీపై ఎంజీజీ-385 రకం పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. విత్తనాల పూర్తి ధర రూ.136 కాగా, ప్రభుత్వం రూ.30 రాయితీ ఇస్తుండటంతో రైతులు కిలోకు రు.106 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి ఉన్న రైతులు పట్టా దార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో స్థానిక రైతు వేదికను సంప్రదించి విత్తనాలు పొందవచ్చు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.