prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 10:27 am Digital Edition : RAJASHEKARREDDY

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బహిరంగ టెండర్లు

బెజ్జంకి, ఆగస్టు 30 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో వివిధ సేవలు, విక్రయాల నిర్వహణకు బహిరంగ టెండర్లు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు.లడ్డు, పులిహోర, కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయంతో పాటు కొబ్బరి చిప్పలు పోగు చేసేందుకు టెండర్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 11.30 గంటలకు టెండర్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 2లోగా టెండర్ దరఖాస్తులను దేవస్థానంలో సమర్పించి, నిబంధనల మేరకు టెండర్లలో పాల్గొనాలని ఈఓ సూచించారు.