శ్రీధర్‌బాబును కలిసిన మారం లక్ష్మారెడ్డి….ఘట్కేసర్ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేత
ఘట్కేసర్, ఆగస్టు 12 (ప్రజా వాణి): ఘట్కేసర్ సర్కిల్‌లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఘట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ఐటీ, భారీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. ప్రధానంగా ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నందున వాటిని వేగవంతం చేయాలని కోరారు. వంతెన నిర్మాణం కారణంగా నష్టపోయిన భూ...