శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన తిరుపతి పోలీసులు
తమిళనాడుకు చెందిన ముగ్గురు, పుత్తూరుకు చెందిన యువకుడు అరెస్ట్.. మరో నిందితుడి కోసం గాలింపుతిరుపతి, ఆగస్టు 11: శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనం సృష్టించిన శివకుమార్ హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ తెలిపారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు, పుత్తూరుకు చెందిన ఒకరు ఉన్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.కత్తులతో దాడి...