శౌర్యశ్రీ ఆత్మీయ పురస్కారం అందుకున్న రెడ్డి సంధ్యా రెడ్డికి అభినందనలు

  ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) పీపుల్ సేవా ఫౌండేషన్ అందిస్తున్న అత్యున్నత శౌర్యశ్రీ ఆత్మీయ పురస్కారం రెడ్డి సంధ్యా రెడ్డి గారికి లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఘనమైన వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.సామాజిక సేవ, మహిళా సాధికారత రంగంలో ఆమె చేస్తున్న విశేష కృషికి గాను ఈ అవార్డు దక్కింది. అతిథులు, శ్రేయోభిలాషులు, పురస్కార గ్రహీతల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రెడ్ కార్పెట్ పై ఆత్మీయ స్వాగతం పొందిన సంధ్యా రెడ్డి గారు అవార్డు అందుకుని...