prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 6:55 pm Digital Edition : SRIKANTH MULUGU

శౌర్యశ్రీ ఆత్మీయ పురస్కారం అందుకున్న రెడ్డి సంధ్యా రెడ్డికి అభినందనలు

 

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

పీపుల్ సేవా ఫౌండేషన్ అందిస్తున్న అత్యున్నత శౌర్యశ్రీ ఆత్మీయ పురస్కారం రెడ్డి సంధ్యా రెడ్డి గారికి లభించింది.
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఘనమైన వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.సామాజిక సేవ, మహిళా సాధికారత రంగంలో ఆమె చేస్తున్న విశేష కృషికి గాను ఈ అవార్డు దక్కింది.
అతిథులు, శ్రేయోభిలాషులు, పురస్కార గ్రహీతల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
రెడ్ కార్పెట్ పై ఆత్మీయ స్వాగతం పొందిన సంధ్యా రెడ్డి గారు అవార్డు అందుకుని అందరి మన్ననలు పొందారు.
ఈ సందర్భంగా ఆమెను పలువురు మహిళా నేతలు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.
ఆమె సేవలు మరెంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.