శాస్త్రీయ పరిశోధనలో రాణిస్తున్న డాక్టర్ సుమతి పోలెబోయిన

శాస్త్రీయ పరిశోధనలో రాణిస్తున్న డాక్టర్ సుమతి పోలెబోయిన .ఐకానిక్ ఉమెన్ సైంటిస్ట్ అవార్డు సాధించిన ప్రతిభావంతురాలు. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్, ప్రజావాణి* బిలాస్‌పూర్ ఫార్మసీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ రంగాల్లో విశేష పరిశోధనలు చేస్తూ డాక్టర్ *సుమతి పోలెబోయిన* శాస్త్రీయ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఎనిమిదేళ్లకు పైగా పరిశోధనా అనుభవం, ఐదేళ్ల బోధనా అనుభవంతో ఆమె నానోఫార్మాస్యూటికల్స్, నానోమెడిసిన్, మధుమేహం, ఆస్టియోపోరోసిస్, న్యూరోఫార్మకాలజీ, గట్-బ్రెయిన్ సంబంధాలు,...