శాస్త్రీయ పరిశోధనలో రాణిస్తున్న డాక్టర్ సుమతి పోలెబోయిన
.ఐకానిక్ ఉమెన్ సైంటిస్ట్ అవార్డు సాధించిన ప్రతిభావంతురాలు.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్, ప్రజావాణి*
బిలాస్‌పూర్ ఫార్మసీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ రంగాల్లో విశేష పరిశోధనలు చేస్తూ డాక్టర్ *సుమతి పోలెబోయిన* శాస్త్రీయ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఎనిమిదేళ్లకు పైగా పరిశోధనా అనుభవం, ఐదేళ్ల బోధనా అనుభవంతో ఆమె నానోఫార్మాస్యూటికల్స్, నానోమెడిసిన్, మధుమేహం, ఆస్టియోపోరోసిస్, న్యూరోఫార్మకాలజీ, గట్-బ్రెయిన్ సంబంధాలు, ప్రీక్లినికల్ డ్రగ్ మూల్యాంకనం వంటి అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు.
నైపర్-గువాహటి నుంచి ఎం.ఎస్, నైపర్-ఎస్.ఏ.ఎస్ నగర్ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె సెలీనియం, గోల్డ్ నానోపార్టికల్స్ ద్వారా చేసిన పరిశోధనలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
*మూడు భారతీయ పేటెంట్లకు సహకారం*
ల్యాబొరేటరీ అపరాటస్, గట్ మైక్రోబయోమ్ అంచనా, బ్లడ్-బ్రెయిన్ బ్యారియర్ స్క్రీనింగ్ వంటి అంశాలకు సంబంధించి మూడు భారతీయ పేటెంట్లలో ఆమె భాగస్వామ్యం ఉంది.
*ప్రతిష్ఠాత్మక అవార్డులు*
2023లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో బెస్ట్ ఓరల్ ప్రెజెంటేషన్ అవార్డు, సీఎస్ఐఆర్-ఎస్‌ఆర్‌ఎఫ్ ఫెలోషిప్ తో పాటు నెట్, గేట్, జీప్యాట్ పరీక్షల్లో అర్హత సాధించారు. రెండు శాస్త్రీయ పుస్తకాలు కూడా రచించారు.
ఈ అసాధారణ విజయాలకు గాను సైంటిఫిక్ లారెన్స్ కమిటీ ఆమెకు ఐకానిక్ ఉమెన్ సైంటిస్ట్ అవార్డు అనే అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాన్ని అందజేసింది.
అవార్డు అందుకున్న డాక్టర్ సుమతి మాట్లాడుతూ “నా ఈ విజయానికి మూల స్తంభం నా భర్త కొమరం మోహన్ రావు గారు. ఈ అవార్డును ఆయనకు అంకితం ఇస్తున్నాను” అని భావోద్వేగానికి లోనయ్యారు.
మారుమూల ములుగు జిల్లా ఆదివాసి గిరిజన ప్రాంతం నుండి వచ్చిన మహిళా ప్రొఫెసర్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల రన్నతపేట గ్రామస్తులు, ములుగు జిల్లా ప్రజలు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.