శనివారం నాడు చండూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఆహ్వానం…. — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
నేను అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా... నువ్వు రాజకీయాల నుండి తప్పుకుంటావా.... మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము.. నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: చండూర్ మున్సిపాలిటీలో మంగళవారం నాడు ప్రభుత్వ అతి గృహం నందు స్థానిక మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిన్న నిర్వహించిన...