వైభవంగా శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. ముఖ్య అతిథులుగా రానున్న నిర్మాత దిల్ రాజు, హీరో వంశీకృష్ణ!

వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల ఆగస్టు 26 ప్రజావాణి  పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహం ఉప్పొంగుతోంది. పట్టణ పరిధిలోని జె.ఎస్.ఆర్. నగర్ లో నూతనంగా అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో నిర్మించిన శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.ఈ మహాత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు, యువ హీరో వంశీకృష్ణ గురువారం విచ్చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు భాగస్వాములు...