వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకురాలు కృష్ణమ్మను పరామర్శించిన తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు

పోరుమామిళ్ల,(ఆగస్టు 27 ప్రజావాణి:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి పి. కృష్ణమ్మ ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డీసీ) చైర్మన్,ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.గురువారం పోరుమామిళ్ల గ్రామానికి విచ్చేసిన ఆయన, కృష్ణమ్మ నివాసానికి స్వయంగా వెళ్లి ఆమెను పరామర్శించారు.ఈ పర్యటనలో దిల్ రాజు కృష్ణమ్మ  దగ్గరకు వెళ్లి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని,యోగక్షేమాలను చాలా ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.ఆమె సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని,పార్టీకి ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఆమె త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని...