
పోరుమామిళ్ల,(ఆగస్టు 27 ప్రజావాణి:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి పి. కృష్ణమ్మ ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డీసీ) చైర్మన్,ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.గురువారం పోరుమామిళ్ల గ్రామానికి విచ్చేసిన ఆయన, కృష్ణమ్మ నివాసానికి స్వయంగా వెళ్లి ఆమెను పరామర్శించారు.ఈ పర్యటనలో దిల్ రాజు కృష్ణమ్మ దగ్గరకు వెళ్లి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని,యోగక్షేమాలను చాలా ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.ఆమె సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని,పార్టీకి ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఆమె త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ మర్యాదపూర్వక సమావేశంలో మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ దేశాయ్ మర్కా రెడ్డి,మాజీ జెడ్పీటీసీ శారదమ్మ,అలాగే వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు.వీరందరితో కలిసి దిల్ రాజు ప్రస్తుత రాజకీయ,సినీ పరిణామాలపై కొద్దిసేపు ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో కృష్ణమ్మ కుటుంబ సభ్యులు కూడా పాల్గొని దిల్ రాజుకి ఘన స్వాగతం పలికారు.సినిమా మరియు రాజకీయ రంగానికి చెందిన ఇరు రాష్ట్రాల ప్రముఖులు ఒకే వేదికపైకి రావడంతో పోరుమామిళ్లలోని కృష్ణమ్మ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.స్థానిక ప్రజలు, అభిమానులు దిల్ రాజుని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.