prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 8:56 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వృద్ధుడి హత్య కేసు ఛేదింపు: కాశినాయన ఏఎస్ఐ కాదరయ్యకు డీఎస్పీ క్యాష్ రివార్డు

కాశినాయన,ఆగస్టు 28 ప్రజావాణి కలసపాడు మండలంలో జరిగిన వృద్ధుడి హత్య కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన కాశినాయన పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ (ASI) కాదరయ్య ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రత్యేకంగా ప్రశంసించి,క్యాష్రి వార్డు అందజేశారు.
అనుభవంతో కేసు ఛేదింపు
ఎకరా 30 సెంట్ల భూవివాదం నేపథ్యంలో రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో ఏఎస్ఐ కాదరయ్య కీలక పాత్ర పోషించారు.తన సుదీర్ఘ పోలీస్ అనుభవంతో క్షేత్రస్థాయి ఆధారాలను సేకరించి,నిందితుల ఆచూకీని కనిపెట్టడంలో దర్యాప్తు బృందానికి ఎంతో ప్రతిభావంతమైన సహకారాన్ని అందించారు.నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంలో మరియు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకోవడంలో ఆయన చొరవ చూపారు.
డీఎస్పీ అభినందనలు
ఏఎస్ఐ కాదరయ్య  విధి నిర్వహణలో చూపిన అంకితభావం,సమర్థతను డీఎస్పీ రాజేంద్రప్రసాద్  కొనియాడారు.ఈ సందర్భంగా కాశినాయన ఏఎస్ఐ కాదరయ్య కి నగదు పురస్కారం మరియు అభినందన పత్రాన్ని అందజేసి సత్కరించారు.క్లిష్టమైన కేసులలో సీనియర్ అధికారులు ఇలాంటి చాకచక్యం ప్రదర్శించడం తోటి సిబ్బందికి స్ఫూర్తిదాయకమని డీఎస్పీ పేర్కొన్నారు