prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 8:12 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

వృక్షాలే జీవకోటికి ప్రాణాధారం

వృక్షాలే జీవకోటికి ప్రాణాధారం

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

వృక్షాలే జీవకోటికి ప్రాణదారమని తొరూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ అన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తొర్రూరు మున్సిపాలిటీ ఎప్పుడు ముందుంటుందని పచ్చదనమే పట్టణ అభివృద్ధికి నిజమైన గుర్తింపు అని అన్నారు. ప్రజల సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ అనే మూడు ప్రధాన లక్ష్యంతో మున్సిపాలిటీ ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రతి ఇంట ఒక మొక్క ప్రతి పౌరుడు ఒక సంరక్షుడు అనే సందేశంతో ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించి హరిత తొర్రూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. వృక్షో రక్షితి రక్షిత, వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, పాఠశాల హెచ్ఎం జెల్లా లక్ష్మీనారాయణ,కౌన్సిలర్లు భూసాని జయమ్మ ఉప్పలయ్య, తూర్పాటి రవి, పేర్ల జంపన్న, మాడుగుల భవానీ లత, కిన్నెర కవిత సతీష్, ముద్దసాని సురేష్, కర్నే నాగరాజు, ధారావత్ పద్మ కిషన్, బసనబోయిన ఐలమ్మ,వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.