బెజ్జంకి, ఆగస్టు 19 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో బుధవారం సురక్ష త్రిరంగా కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మైనర్ డ్రైవింగ్, మూఢనమ్మకాలు తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, బ్యాంకు ఖాతా సమాచారం అందించవద్దని సూచించారు. అలాగే మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుముల సతీష్, ఉప సర్పంచ్ అన్నారం లత తిరుపతిరెడ్డి,వార్డు సభ్యులు,బెజ్జంకి పోలీసులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.