విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
తొర్రూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కరించాలి అని కోరుతూ తొర్రూరు మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం ఆదివారం వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ను కలిసి వినతిపత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం తొర్రూరు మండల శాఖ అధ్యక్షుడు ఇట్టే సోమారెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కోరుతున్నామని, అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా, రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ఆయన...