prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 8:42 am Digital Edition : MEERASAHAB CHILUKUR

విలేఖరులతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాటామంతీ*

*చిలుకూరు ఆగస్టు18 (ప్రజావాణి)*: కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండల విలేఖరులతో మర్యాదపూర్వకంగా కలిసి వారితో ముఖాముఖీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మీడియా కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో విలేఖరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో  స్థానిక విలేఖరులు ఆంజనేయులు,కృష్ణ మూర్తి, వంశీకృష్ణ, షేక్ మీరా,విరబాబు,వెంకన్న గౌడ్, సైదులు,అమరగాని కృష్ణ పాల్గొన్నారు.