prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:43 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఘట్‌కేసర్, ఆగస్టు 28 (ప్రజావాణి): నారపల్లి విద్యుత్ శాఖ పరిధిలో వివిధ విద్యుత్ పనుల నిర్వహణ కోసం శనివారం (ఆగస్టు 29) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజినీర్ విక్రమ్ బుక్యా తెలిపారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సాయి సందీప్, శ్రీకృష్ణనగర్, అన్నోజిగూడ పాత గ్రామం, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీ, ఎల్‌ఐజీ కాలనీ, హనుమాన్‌నగర్, ఇందిరానగర్, సాయినగర్ కాలనీ, సత్యసాయి హౌసింగ్ కాలనీ, సాయి గణేష్ కాలనీ, సాయి గణేష్ ఎన్‌క్లేవ్, సుముకేష్ హైట్స్, ఐఫోసిటీ, ప్రేమలతా గ్రాండియర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 గంటల వరకు ఇన్ఫోసిస్ హాస్టల్ పరిధిలోని కాలనీలు, సెరెనియా హిల్స్, పోచారం గ్రామంలోని శివాలయం ప్రాంతం, పోచారం గ్రామం, అన్నానగర్, డాక్టర్స్ కాలనీ, విజయసాయి ఎన్‌క్లేవ్, గెలాక్సీ టవర్స్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

విద్యుత్ పనుల నిర్వహణలో భాగంగా సరఫరా నిలిపివేస్తున్నందున వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.