ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
ములుగు జిల్లా: విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వర పరిష్కారం కోసం వెంకటాపూర్ లో “విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు” ఏర్పాటు చేస్తున్నట్లు TGNPDCL విద్యుత్ వినియోగదారుల ఫోరం CGRF-I, CHAIRPERSON (FAC) G. నాగప్రసాద్ తెలిపారు.
సదస్సు వివరాలు:
తేది:12.08.2026
సమయం: ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు
*వేదిక:* 33/11 KV వెంకటాపూర్ సబ్ స్టేషన్ కార్యాలయ ఆవరణ
ఈ లోకల్ కోర్టులో స్వీకరించే ఫిర్యాదులు
1. విద్యుత్ పునరుద్ధరణ
2. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ మార్పు
3. వోల్టేజ్ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల
4. లోపాలు ఉన్న మీటర్లు మార్చడం
5. నూతన సర్వీసులు మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ
6. సర్వీసు పేరు మార్పు, కేటగిరీ మార్పు
7. వాడకానికి హెచ్చు మొత్తంలో గల బిల్లులు
8. సర్వీస్ రద్దు తదితరాలు
ఈ అవకాశాన్ని మల్లంపల్లి, ములుగు, వెంకటాపూర్, పసర మరియు తాడ్వాయి సెక్షన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ములుగు డివిజనల్ ఇంజనీర్ కన్న రాజు ఒక ప్రకటనలో కోరారు.
విద్యుత్ కు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉన్న వినియోగదారులు పై తేదీన, సమయంలో తమ పత్రాలతో సదస్సుకు హాజరు కావాలని సూచించారు.