చిలుకూరు ఆగస్టు 09:(ప్రజావాణి):విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం ఆర్లెగూడెం గ్రామంలో చోటుచేసుకుంది చిలుకూరు ఎస్సై బండి మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ నివాసి గొర్రె రాంబాబు స్కూల్ వ్యాన్ డ్రైవర్ తన నివాసంలో ఇంటి నిర్మాణ నిర్మా ణం చేసే సమయంలో విద్యుత్ బాక్స్ వైర్ల ను తన ఇంటి ప్రక్కన గల ప్రదేశంలో ఒక కర్రకు కట్టాడు. ఇంటి నిర్మా ణం పూర్తియి ఇటీవల గృహాప్రవేశం కూడ చేశారు. ఇంటి భయట ఉన్న విద్యుత్ వైర్లును తన ఇంట్లోకు మార్చుకునేందుకు గోడలో ఇర్కుకొని పోయిన వైర్లు గడ్డపారతో తీస్తున్న క్రమంలో ప్రమాధవ శాత్తు విద్యుత్ వైర్లు గడ్డపారకు తగలటంతో విద్యుత్ షాక్ గురై గురై అక్కడిక్కడే మృతి చెందాడని కుమారుడు వంశీ ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెస్తున్నామని చిలుకూరు ఎస్ఐ తెలిపారు. దీనీతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.పార్థివ దేహాన్ని కోదాడ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం పక్షాన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియ తెలియపరుస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.