prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 6:52 pm Digital Edition : RAJASHEKARREDDY

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన బెజ్జంకి ఎస్సై తిరుపతి

బెజ్జంకి, ఆగస్టు 12 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై టి. తిరుపతి విద్యార్థులకు ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, నకిలీ లింకులు, మోసపూరిత కాల్స్, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు.అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ వంటి వివరాలను పంచుకోవద్దని సూచించారు.అనుమానాస్పద లింకులను తెరవకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని బెజ్జంకి ఎస్సై తిరుపతి సూచించారు.