prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 9:40 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

విద్యార్థులకి సైకిల్ పంపిణీ చేసిన – వెంకట్ రామ్ రెడ్డి

 

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

చండూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన విద్యార్థిలు బంగారిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుతు ప్రతి రోజు గొల్లగూడెం గ్రామం నుండి పాఠశాలకు ప్రతిరోజు ఎవరు రోడ్డుపై కలిస్తే వారిని లిఫ్ట్ అడుగుతూ వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారూ. అదే గ్రామానికి చెందిన టిఆర్ ఫౌండేషన్ సభ్యులద్వారా తెలుసుకున్న మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన టిఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి వెంటనే స్పందించి ఆ విద్యార్థిలకు సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ రామ్ రెడ్డి కి గ్రామ సర్పంచ్ రావుల రవి రజిత, ఉప సర్పంచ్ పల్లపు స్వామి గారు ,బిజెపి జిల్లా కమిటీ సభ్యులు మాదగోని వెంకన్న గౌడు, టి ఆర్ ఫౌండేషన్ సభ్యులు నరముల సందీప్. డేరంగుల శ్రవణ్ విద్యార్థి తల్లిదండ్రులు అలాగే గ్రామ పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.