prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 9:21 pm Digital Edition : PRAJA VANI

విద్యాబుద్ధులు నేర్పిన గురువుపై ఇంతటి ఘాతుకమా<br>

విద్యాబుద్ధులు నేర్పిన గురువుపై ఇంతటి ఘాతుకమా

* ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై సామాజిక కార్యకర్త శశిధర్ రెడ్డి తీవ్ర ఆవేదన

* నిందితులకు కఠిన శిక్ష విధించాలి

* పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి

జమ్మికుంట ఆగస్ట్ 20(ప్రజావాణి)

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రూపారెడ్డిపై జరిగిన దారుణ హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వీణవంక మండలానికి చెందిన సామాజిక కార్యకర్త ఎలుక శశిధర్ రెడ్డి అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువునే హతమార్చడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారుజల్సాలు వ్యసనాల కోసం విద్యార్థులు ఇలాంటి పాశవిక చర్యకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు సమాజం మొత్తం తలదించుకునేలా చేస్తున్నాయని అన్నారు. ఈ ఘటన విద్యారంగానికే తీరని మచ్చగా మారిందని పేర్కొంటూహత్యకు పాల్పడిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి, బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని శశిధర్.రెడ్డిడిమాండ్.చేశారుపిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలితల్లిదండ్రులు పిల్లల మార్కులు ర్యాంకులపైనే కాకుండా వారి ప్రవర్తన స్నేహాలు, అలవాట్లపై కూడా నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. చిన్న వయసు నుంచే నైతిక విలువలు, బాధ్యత, జీవన నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారుమత్తు పదార్థాలపై ఉక్కుపాదంగంజాయి ఇతర మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలు యువతకు చేరకుండా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరారుపాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ విద్య తప్పనిసరి చేయాలిపుస్తక జ్ఞానంతో పాటు భావోద్వేగాల నియంత్రణ, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మంచి-చెడుల మధ్య విచక్షణ వంటి అంశాలను విద్యార్థులకు బోధించేలా పాఠశాల స్థాయి నుంచే లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని శశిధర్ రెడ్డి కోరారు.ఇలాంటి హృదయవిదారక ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం విద్యా సంస్థలు, తల్లిదండ్రులు సమాజం సమష్టిగా బాధ్యత తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.