prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:32 am Digital Edition : RAJASHEKARREDDY

వర్షాకాలం దృష్ట్యా గుగ్గిళ్లలో పారిశుద్ధ్య చర్యలు- రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త తొలగింపు

బెజ్జంకి, ఆగస్టు 18 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. వర్షాల సమయంలో చెత్త పేరుకుపోయి దోమలు, ఇతర క్రిమికీటకాలు పెరగకుండా, గ్రామ ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు పారిశుద్ధ్య చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.