వరుస దొంగతనాలతో వణికిపోతున్న మర్రిగూడ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మర్రిగూడ మండలంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న శివన్నగూడెంలో రెండు ఇళ్లలో దొంగతనాలు జరగగా.. తాజాగా కుదబక్షపల్లి గ్రామంలో మరో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనిస్తూ, తాళాలు పగులగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుస చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి యజమానులు లేని సమయంలోనే.. శివన్నగూడెం గ్రామానికి చెందిన చిలుకూరి యాదయ్య...