prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 9:50 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

వరుస దొంగతనాలతో వణికిపోతున్న మర్రిగూడ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

మర్రిగూడ మండలంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న శివన్నగూడెంలో రెండు ఇళ్లలో దొంగతనాలు జరగగా.. తాజాగా కుదబక్షపల్లి గ్రామంలో మరో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనిస్తూ, తాళాలు పగులగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుస చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి యజమానులు లేని సమయంలోనే..
శివన్నగూడెం గ్రామానికి చెందిన చిలుకూరి యాదయ్య ఈ నెల 25న భార్యతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. అనంతరం అదే గ్రామంలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఇంటిని ఖాళీగా ఉంచి పరిశీలించిన దొంగలు తాళాలు పగులగొట్టి చోరీ చేసినట్లు సమాచారం.
కుదబక్షపల్లిలో మరో చోరీ..
శనివారం రాత్రి కుదబక్షపల్లి గ్రామంలో రోడ్డు వైపు ఉన్న కుందారపు యాదయ్య ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రెండు తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు సమాచారం. వరుసగా మూడు ఇళ్లలోనూ ఇంటి యజమానులు లేని సమయంలోనే చోరీలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పోలీసులకు సవాల్‌గా వరుస చోరీలు..
మండలంలో కొద్ది రోజుల వ్యవధిలోనే వరుసగా చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని ముందుగానే ముందుగానే గమనించి పక్కా ప్రణాళికతో చోరీలకు చూస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, గతంలో చోరీలకు హాజరైన వారి కదలికలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసులు గస్తీ పెంచాలి..
గ్రామాల్లో రాత్రివేళల్లో పోలీసుల గస్తీని పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. వరుస చోరీలకు ఇస్తున్న దుండగులను త్వరగా గుర్తించి అరెస్టు చేసి, ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.