prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 2:22 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

లారీల ద్వారా అక్రమ కలప రవాణా ఆర్టిఏ జాడ ఎక్కడ?

లారీల ద్వారా అక్రమ కలప రవాణా ఆర్టిఏ జాడ ఎక్కడ?

సూర్యాపేట నుండి వయా దంతాలపల్లి గుండా ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ కల్ప రవాణా లారీల ద్వారా పగలు రేయి అనే తేడా లేకుండా జరుగుతుంది. ఓవర్ లోడ్ తో వస్తున్న లారీల మూలంగా రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఈ కర్రలు కూలి చనిపోయే ప్రమాదం ఉందని రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కల్ప రవాణా ఇష్టారాజ్యంగా జరుగుతున్న కానీ ఓవర్ లోడ్ తో అజాగ్రత్తగా లారీలు నిరంతరం ప్రయాణం చేస్తున్న, అధికారులకు పట్టింపు లేకపోవడంతో.ఈ అక్రమ కలప రవాణాను అడ్డుకునే ఆర్టిఏ అధికారి మాత్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాడా లేడా అనే ప్రశ్నలకు తావిస్తుంది. ఈ ఓవర్ లోడ్ కలప రవాణా మూలంగా, టూ వీలర్స్ ప్రయాణికులు, పాదాచారులు , ఆ రహదారి వెంట అనునిత్యం ప్రయాణించాలంటేనే, “దిన దిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా మారింది. ఓవర్ లోడ్ ఎవరిపైనా ఆయన కూలి పడితే ఆ ప్రమాద బాధ్యతను ఎవరు వహిస్తారని అధికారులను ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కావున అలాంటి ప్రమాదాలు జరగక ముందే జిల్లా ఆర్టిఏ అధికారి గాని, స్థానిక పోలీస్ అధికారులు కానీ ఈ లారీలపై నిగ ఏర్పాటు చేసి అక్రమ ఓవర్లోడ్ కల్పను తరలిస్తున్న లారీలపై, వాటి యజమానులపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, రోడ్డు భద్రతకు భంగం కలగకుండా ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని రహదారిపై అనునిత్యం ప్రయాణిస్తున్న ప్రయాణికులు భావిస్తున్నారు. కావున జిల్లా ఉన్నత అధికారులు దీనిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.