రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి స్టేషన్లు, RUBలను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు ఆయా ప్రాంతాల్లోని రైల్వే అండర్ బ్రిడ్జిలను ఆయన పరిశీలించారు. రైల్వే అధికారులతో కలిసి స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీ...