*రెండో రోజుకు చేరిన మయూర ఇండియా కంపెనీ సమ్మె*
*చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలి: బీఆర్‌టీయూ అధ్యక్షుడు శంభు ప్రభాకర్*
మేడ్చల్ ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్ పరిధిలోని మయూర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు మద్దతుగా మేడ్చల్ జిల్లా బీఆర్‌టీయూ అధ్యక్షుడు శంభు ప్రభాకర్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌పై యాజమాన్యం తక్షణమే చర్చలు జరిపి న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కక్షసాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని కోరారు. 2022లో కోత విధించిన టిడిపి ఇన్సెంటివ్‌లను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్యతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.