prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:51 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన బీరంగూడ బ్రాంచ్‌

•రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన బీరంగూడ బ్రాంచ్‌

 

*ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు.. పలు ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం

 

బీరంగూడ, ఆగస్టు 15 (ప్రజావాణి): నారాయణ స్కూల్స్‌ బీరంగూడ బ్రాంచ్‌ రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. ‘ఆస్పైర్‌ సమ్మిట్‌ 3.0’ కార్యక్రమంలో బీరంగూడ బ్రాంచ్‌కు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

పాఠశాల విద్యార్థుల డ్రాప్‌అవుట్‌ శాతాన్ని నియంత్రించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలను గుర్తిస్తూ పాఠశాలకు ప్రత్యేక అవార్డు లభించింది. ఈ అవార్డును ఏజీఎం వేణుగోపాలరావు, ప్రధానోపాధ్యాయులు శ్రీవిద్య, ఎగ్జామ్స్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ శేషారత్నం, ఈ-కిడ్జ్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ పవర్‌ రుతుజా, అకాడమిక్‌ డీన్‌ నరసింహ, ఆర్‌ఐ చక్రధర్, ఏవో శివ తదితరులు డైరెక్టర్‌ రమ చేతుల మీదుగా అందుకున్నారు.

అలాగే సబ్జెక్టు ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించడంలో విశేష కృషి చేసిన ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు లభించాయి. గణిత విభాగంలో చంద్రకళ, రవళి, విజ్ఞాన శాస్త్ర విభాగంలో నరసింహ, రమ్య, హసీనా, సాంఘిక శాస్త్ర విభాగంలో రసజ్ఞ తమ బోధనకు గాను ఈ పురస్కారాలను అందుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థుల విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు అందుకోవడం పట్ల బీరంగూడ బ్రాంచ్‌ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.