రామాయంపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర
రామాయంపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర జాతీయ జెండాలతో కదం తొక్కిన వెయ్యి మంది విద్యార్థులు రామాయంపేట: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే లక్ష్యంతో రామాయంపేటలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు...