పాల్గొన్న మాజీ మేయర్, కార్పొరేటర్లు,నాయకులు, కాలనీ వాసులు
మేడిపల్లి ఆగస్టు 16(మన ప్రజావాణి) మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, డివిజన్–11 పరిధిలోని రాజీవ్ నగర్ ఫేజ్–2 కాలనీలో ఏర్పాటు చేసిన నూతన ప్రవేశద్వారాన్ని బోడుప్పల్ మాజీ ఉప సర్పంచ్,దివంగత కీర్తి శేషు బొమ్మక్ గోపీనాథ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు,బోడుప్పల్ డివిజన్–11 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మక్ కళ్యాణ్ కుమార్ తన తండ్రి పేరుతో ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్,మాజీ కార్పొరేటర్లు పోగుల నర్సింహ్మారెడ్డి,రాసాల వెంకటేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ లు పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రాజీవ్ నగర్ ఫేజ్–2 కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తూ,ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండే బొమ్మక్ కళ్యాణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. దివంగత బోమ్మక్ గోపీనాథ్ జ్ఞాపకార్థం ఆయన పేరుతో ప్రవేశద్వారం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చేంగిచెర్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్,దానగళ్ల యాదగిరి,తుర్పాటి యాదయ్య,విశ్వం గుప్తా,
ఎం డి అఫ్జల్,మేడ్చల్–
మల్కాజ్‌గిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మక్ అజయ్,బొమ్మక్ నితేష్,యువజన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్,
పవన్,అరవింద్,సురేష్,రాహుల్,శ్రీను,అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడు ఉరాటి మహేష్,ప్రధాన కార్యదర్శి ఎస్ కే రహీం, రాజీవ్ నగర్ కాలనీ ఫేజ్–2 అధ్యక్షుడు నరేష్, నరేందర్,రాజేష్,బాలు, సంతోష్ రెడ్డి,శ్రీనివాస్,
మద్దయ్య,టిల్లు,నాయకులు,యువత,మహిళలు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
