prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 4:26 pm Digital Edition : MAHESH MEDCHAL

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి దోసకాయల వెంకటేశం

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి దోసకాయల వెంకటేశం

మేడ్చల్, అక్షిత ప్రతినిధి: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా దోసకాయల వెంకటేశం మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోవర్ధన్ రెడ్డి, ఇర్రి రవీందర్ రెడ్డి, వైద్యనాథ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాలరావు, జర్రిపోతుల నర్సింహులు, భూపాల్, నర్సారెడ్డి, గురువయ్య, బసవ రెడ్డి, లక్ష్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గోపి, కొల్తూరు గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, మహేష్, దామోదర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కొల్తూరు బాలకృష్ణ, నర్సింహులు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వీరేశం గుప్తా, లక్ష్మణ్, విష్ణు రెడ్డి, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.