prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 6:11 pm Digital Edition : MAHESH MEDCHAL

రాఘవేందర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఐఎన్టి యుసి ఆటో సంఘం నాయకులు

ప్రజా సేవలో ముందుండాలి..

రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలి

మేడ్చల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకుర్తి రాఘవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు రాజకీయ వర్గాలు, అభిమానులు, అనుచరుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేడ్చల్ ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ నాయకులు రాఘవేందర్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. రాఘవేందర్ గౌడ్ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. మేడ్చల్ ప్రాంత ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా కార్మికులు, ఆటో డ్రైవర్లు, పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలపై మరింతగా దృష్టి సారించాలని కోరారు.

వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించాలి

రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి రాఘవేందర్ గౌడ్ కార్పొరేటర్‌గా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆటో యూనియన్ నాయకులు ఆకాంక్షించారు. ప్రజల నమ్మకాన్ని చూరగొని మేడ్చల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

రాఘవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టి రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ 297 అధ్యక్షుడు ఎర్ర విజయరావు, వెంకటేష్ ముదిరాజ్, కలీల్ బాబు, కుమార్, రమేష్, సుధాకర్, సత్యనారాయణ, సురేష్ ముదిరాజ్, గణేష్, దుర్గపతి తదితరులు పాల్గొన్నారు.