రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ వేడుకలు

మెదక్: రాఖీ పండుగ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు లావుడియా రాములు నాయక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నాచెల్లెళ్ల ఆత్మీయ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాఖీ పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమానురాగాలు, ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సోదరులు తమ సోదరీమణులకు అండగా ఉంటామని, వారి జీవితాల్లో ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు....