రాంగ్‌రూట్‌లో వచ్చిన స్కూల్ బస్సు ఢీ యువకుడికి తీవ్ర గాయాలు
రాంగ్‌రూట్‌లో వచ్చిన స్కూల్ బస్సు ఢీ యువకుడికి తీవ్ర గాయాలు మేడ్చల్: జాతీయ రహదారి 44పై లోటస్ వెంచర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్‌రూట్‌లో వస్తున్న జీవికె ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదోనిగడ్డ తాండకు చెందిన నూనావత్ సాయి (23) తీవ్ర గాయాలపాలయ్యాడు. సాయి కిషన్ కుమారుడని, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం తీవ్రంగా గాయపడిన సాయిని...